కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతల చేరిక

వైయస్సార్సీపీలోకి  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి
బీవై రామయ్యతో పాటు ఇతర నేతలకు ఆహ్వానం

హైదరాబాద్: కర్నూలు జిల్లా నుంచి వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైయస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీవై రామయ్యతో పాటు పెద్ద ఎత్తున నేతలు  వైయస్సార్సీపీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  వైయస్ జగన్ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ... జనమంతా వైయస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దాంట్లో తమ చేయూత కూడా ఉండాలని, జనంతో పాటు నడవాలని స్వచ్చంధంగా పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు.  కర్నూలు జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా జనం మాత్రం జననేత వైయస్ జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

 రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్పీదే విజయమని తేల్చిచెప్పారు. 
జిల్లాలోని మొత్తం 14 స్థానాలు వైయస్సార్సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 

Back to Top