<br/>శ్రీకాకుళం: నిత్యం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తపించే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అన్నిప్రాంతాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. జననేత ప్రకటించిన నవరత్నాల పథకాలకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి టీడీపీ నేత మునిస్వామి కూడా అధికార పార్టీని వీడి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరి చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. మునిస్వామితో పాటు పలువురు టీడీపీ నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు చేసేందుకే నవరత్నాలు ప్రకటించామన్నారు. <br/>అంతకుముందు వైయస్ జగన్ తన పుట్టిన రోజు వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న జననేత టెక్కలి నియోజకవర్గంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు జననేతకు ఆశీర్వచనం ఇచ్చారు. వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానుల, పార్టీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, విదేశాల్లోని ఆయన అభిమానులు జననేత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గతేడాది జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.<br/>వైయస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్, పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు వి కళావతి, కంబాల జోగులు, సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖరం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఉన్నారు.