కుల వృత్తులకు ప్రోత్సాహం:షర్మిల

కొత్తూరు, (మహబూబ్ నగర్ జిల్లా):

జగనన్న సీఎం అయితే ప్రజల కష్టాలు తీరుస్తారని, కుల వృత్తులకు ప్రాధాన్యమిస్తారని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల అన్నారు.  'మరో  ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది.  దారి పొడవునా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మహానేత పాలనలో తాము ఇన్ని కష్టాలు పడలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు.

     గ్రామాల్లో తాగు, సాగు నీరు లేక అవస్థలు పడుతున్నామని కొత్తూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పాదయాత్రలో భాగంగా కుమ్మరి కులస్తులను శ్రీమతి షర్మిల పలకరించారు. సారెపై కుండలు తయారు చేస్తున్న విధానం అడిగి తెలుసుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వ విధానాల వల్ల కుల వృత్తులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

     జగనన్న త్వరలోనే బయటకు వస్తారని మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తారని శ్రీమతి షర్మిల అన్నారు. అప్పుడు ప్రజల కష్టాలు తీరుతాయని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. రాజన్న బిడ్డ తమ కష్టాలు ఆలకించిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని పలు గ్రామాల ప్రజలు షర్మిలతో చెప్పారు.

Back to Top