లక్కవరపుకోట: అధికారం దాహంతో కన్నతల్లిలాంటి పార్టీను ఫిరాయించి మంత్రి పదవి పొందిన సుజయ్‌కష్ణరంగారావుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను విమర్శించే స్థాయి లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భీమాసింగ్ సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ తూర్పాటి కృష్ణస్వామినాయుడు అన్నారు. లక్కవరపుకోట మండలం గొల్జాం గ్రామంలోస్థానిక విలేకరలుతో సోమవారం మాట్లాడారు. ఏపార్టీ నుంచి గెలిచారో ఆపదవికి రాజీనామా చేసి మరల గెలిచి అప్పుడు విమర్షలలు చేస్తే మంచిదని సుజయ్‌కృష్ణరంగారావుకు సవాల్ విసిరారు. సుజయ్‌కృష్ణరంగారావు తమ ఆస్తులను కాపాడుకునేందకు,అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ద్యేయంతోనే తెలుగుదేశం పార్టీలోకి చేరారని ఇప్పడు వారి మెప్పు పొందేందుకు బొత్స సత్యనారయణను విమర్షిస్తున్నారని అన్నారు.