ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు

నెల్లూరు: ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారన్నారు. అదే విధంగా ఓఎస్డీ విఠలేశ్వర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనకు సంబంధం లేకపోయినా క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు బనాయించి వేధిస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రజల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని, ఇంకో సంవత్సరంలో టీడీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. 
 
Back to Top