'కోత'లపై ఎగసిన నిరసన జ్వాల

రాజమండ్రి: విద్యుత్తు కోతలపై నిరసన ఉద్యమం మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్‌స్టేషన్లను బుధవారం ముట్టడించి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. అధికారులు కార్యాలయాల్లోకి వెళ్లకుండా తాళాలు వేసి నిర్బంధించారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని నినదించారు.

చెవిలో పువ్వు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, మాజీ మేయర్ ఎం.ఎస్.చక్రవర్తి తదితరులు సిటీ, రూరల్ నియోజకవర్గాల నేతలతో కలిసి రాజమండ్రి వై.జంక్షన్ వద్ద ఉన్న సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. చెవిలో పువ్వులు, ఆకులతో నిరసన తెలిపారు. గేట్లకు తాళాలు వేసి అధికారులను అడ్డుకున్నారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు.

సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్వాన..

కాజులూరు మండలం ఆర్యవటంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నాయకులు ముట్టడించారు. తొలుత గ్రామంలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా సబ్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. మండపేట మండలం తాపేశ్వరంలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో నాయకులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా అధికారులను నిర్బంధించి నినాదాలు చేశారు. జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్, కిసాన్ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, స్టీరింగ్ కమిటీ సభ్యులు సత్తి వీర్రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఏలేశ్వరంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల నేతలు మాజీ ఎమ్మెల్యే,పార్టీ నేత వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బాలాజీ సెంటర్ నుంచి సబ్‌స్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు.

అల్లవరంలో...
మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు బుచ్చి మహేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు అల్లవరంలో సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు. గంట పాటు అధికారులను నిర్బంధించిన అనంతరం విద్యుత్ వెతలపై వినతిపత్రం అందజేశారు. రావులపాలెం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు.  జగ్గంపేటలో కేంద్రపాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేసారు. పెద్దాపురంలో యువజన నాయకుడు తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కోటనందూరులో పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు దాడిశెట్టి రాజా, రొంగల లక్ష్మి, డి.చిరంజీవిరాజులు విద్యుత్ కోతలకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. బిక్కవోలులో పార్టీ నేతలు సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కోరుకొండ, సీతానగరంలలో మండల నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ ఆందోళనలు చేశారు.
బుచ్చి మహేశ్వరరావు పిలుపు

అమలాపురం: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఈ నెల 31న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ క్రమశిక్షణ సంఘ సభ్యుడు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి నివాసంలో బుధవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతిన వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ వారికి సూచించారు.

కోతలపై కన్నెర్ర
గుంటూరు: విద్యుత్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకు రాజీలేని పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దశలవారీగా విద్యుత్ పోరు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లావ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం, సబ్‌స్టేషన్ల ముట్టడి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 31న అన్ని ప్రజా సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలతో కలిసి జిల్లా బంద్‌ను నిర్వహించనున్నారు. వర్తక వాణిజ్య సంఘాలతో రౌండ్‌టేబుళ్లు, సమావేశాలు నిర్వహించి అజెండా సిద్ధం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు రెండో రోజు కూడా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సబ్‌స్టేషన్ ముట్టడించారు. దుర్గి మండలంలో పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో పార్టీనేత యెనుముల మురళీధర్‌రెడ్డి నేతృత్వంలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. రేపల్లె నియోజకవర్గంలో చెరుకుపల్లి మండలం కావూరులో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించి రాస్తారోకో నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో పార్టీ నేత మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ల వద్ద ధర్నా నిర్వహించారు.  బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలో ఐలాండ్ సెంటర్‌లో పార్టీ నాయకులు అక్కల శ్రీనివాసరెడ్డి, ఆట్ల నారాయణరెడ్డి, పులుగు సముద్రాలరెడ్డి, తదితరులు ధర్నా నిర్వహించారు. మంగళగిరి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పార్టీ నేత మున్నంగి గోపిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.  పొన్నూరులో పార్టీనేత మారుపూడి లీలాధర్ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు.  ప్రత్తిపాడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మండల నేతలు ముట్టడించారు. తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం మండలంలో జరిగిన సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నల్లచెరువు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి నేతృత్వంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీదే భవిష్యత్తు: రామచంద్రారెడ్డి
అనంతపురం: అన్ని వర్గాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీదే భవిష్యత్తని ఆ పార్టీ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న స్వర్ణయుగం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని చెప్పారు. బుధవారం నగరంలోని వీకే భవన్‌లో వైఎస్సార్‌సీపీ సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించారు. మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మన రాష్ర్టంలో ఆ ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతోపాటు విద్యుత్ సమస్యపై ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు వై విశ్వేశ్వర రెడ్డి,  కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు పైలా నర్సింహయ్య, కేంద్ర పాలక మండలి సభ్యుడు గిర్రాజు నగేష్ , తోపుదుర్తి కవిత, సభ్యత్వ నమోదు రాష్ట్ర కో ఆర్డినేటర్ జీవీ సుధాకర్‌రెడ్డి,  జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంక రనారాయణ మాట్లాడారు.

సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన
 జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బుధవారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నగరంలోని వీకేభవన్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్ జీవీ సుదర్శన్‌రెడ్డి, సీఈసీ, సీజీసీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

జగన్‌పై కక్ష సాధింపే ప్రభుత్వ అజెండా

బుక్కరాయసముద్రం: ప్రభుత్వం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధించడమే అజెండాగా పెట్టుకుందని, టీడీపీ కూడా అదే బాటలో నడుస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, సింగిల్ విండో అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మండల వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలోవైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన రైతులతో కలిసి స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సింగిల్ విండో అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపు
తిరుపతి: ప్రజల బతుకులు చీకటి పాలు చేస్తూ, రైతుల జీవితాలకు చరమగీతం పాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 31వ తేదీ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్న బంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి ప్రజలు, పార్టీ శ్రేణలను కోరారు. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రజలమీద ఒక్క రూపా యి పన్ను కూడా వేయకుండా పరిపాలించారన్నారు. ఆయన హయాంలో ఏనాడూ విద్యుత్ చార్జీలు కూడా పెంచలేదని చెప్పా రు.

వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టు
పూతలపట్టు: కేంద్ర ప్రభుత్వ 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డికి కరెంటు సమస్యలను వివరించేందుకు వెళుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రాజారత్నంరెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.  బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని పాకాల పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. తులసిరెడ్డి పూతలపట్టు మండల పర్యటనలో భాగంగా ముందుగా పి.కొత్తకోట చౌకదుకాణం వద్దకు వెళ్లారు.  తులసిరెడ్డి పర్యటనకు ఎక్కడ ఆటంకం కలిగిస్తారోనని రాజరత్నంరెడ్డిని, కార్యకర్తలను పాకాల సీఐ వెంకటనారాయణ, పూతలపట్టు ఎస్‌ఐ  హౌస్‌అరెస్టు చేశారు. సాయంత్రం వారిని విడుదలచేశారు.

పార్టీని బలోపేతం చేయాలి
ఆదిలాబాద్ : ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు మునిపెల్లి సాయిరెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గ విస్త్రృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. నియోజకవర్గ ఇన్‌చార్జి బి.అనిల్‌కుమార్ అధ్యక్షత వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ వర్గానికి చెందిన వారు ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారని, దీనికి పాలకుల నిర్లక్ష్యమే ఏకైక కారణమని సాయిరెడ్డి దుయ్యబట్టారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ ఈనెల 31న వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు బంద్ విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్, బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు మాట్లాడారు. యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య ఆధ్వర్యంలో సుమారు 80 మంది యువకులు పార్టీలో చేరారు. చైతన్యను యువజన విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తున్నట్లు బోడ జనార్దన్ ప్రకటించారు.

కాంగ్రెస్‌కు ఇదే చివరి అధికారం: రెహ్మాన్
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇదే చిట్టచివరి అధికారమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాకల కమిటీ సభ్యుడు, ఆ పార్టీ మైనార్టి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అబ్దుల్ రెహ్మన్ అన్నారు. నియోజకవర్గ కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.

రేపు జిల్లా బంద్‌కు అందరూ సహకరించాలి: బోడ

ఆదిలాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రైతు సమస్యలపై చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ పిలుపునిచ్చారు. రైతులను విస్మరించిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. బుధవారం ఆయన ఆదిలాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

నేడు విద్యా సంస్థల బంద్
అనంతపురం: విద్యుత్తు కోత సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్ సందర్భంగా ఈ నెల 31 విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.

Back to Top