కొప్పర్రు నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

కొప్పర్రు (ప.గో.జిల్లా),

27 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 161 వ రోజు సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలొని కొప్పర్రు నుంచి ప్రారంభమైంది. కొప్పర్రు నుంచి ఆమె లికితపూడి, సరిపల్లి మీదుగా నర్సాపురంలోని శ్రీహరిపేట వరకూ పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ తెల్లం బాలరాజు తెలిపారు. నర్సాపురంలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వారు చెప్పారు. కాగా, రాత్రికి పాలకొల్లులో బసచేస్తారు. మొత్తం మీద శ్రీమతి షర్మిల సోమవారంనాడు 14.5 కిలోమీటర్లు నడుస్తారని వారు వివరించారు.

Back to Top