కొనసాగుతున్న విజయమ్మ పర్యటన

తుని :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వరుసగా మూడోరోజు కూడా వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపునకు గురైన అమ్మాజీపేట, కంకిపాటి వారి దరువు, రాజీవ్‌ గృహకల్ప, కుమ్మరిలోవ ప్రాంతాల్ని ఆమె బుధవారం పరిశీలించారు. ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యేకానీ, ఎంపీ గానీ తమను పట్టించుకోలేదంటూ బాధితులు విజయమ్మకు మొరపెట్టుకున్నారు. సీఎం పర్యటనలో సమస్యల్ని చెప్పుకుందామని వెళితే కొట్టి తరిమేశారని ఆవేదన చెందారు. అందరి సమస్యల్ని విన్న వైయస్‌ విజయమ్మ అసెంబ్లీలో వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. అనంతరం కుమ్మరిలోవలో బాధితులకు దుప్పట్లు పంచిపెట్టారు. ఆ తర్వాత విశాఖ జిల్లా పాయకరావుపేటలో పర్యటించారు. తొలుత తునిలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం.. పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన

Back to Top