కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం

ఖమ్మం, 03 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర  ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కొనసాగుతోంది. అక్కవారి తండా నుంచి నడుస్తూ వెడుతున్న శ్రీమతి షర్మిలను కరివేపాకు రైతులు శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఆమెకు ఏకరువు పెట్టారు. ఇచ్చే నాలుగు గంటలు కూడా సరిగా విద్యుత్తు ఇవ్వకపోవడంతో పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దిగుబడి తగ్గిపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు మొరపెట్టుకున్నారు.

Back to Top