రిగ్గింగ్ కు చంద్రబాబు కుట్రలు

నంద్యాల: వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ‘తెలుగుదేశం ఓ రోగిష్టిపార్టీ అని ధ్వజమెత్తారు.  వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక 10 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు, కొడుకు, బావమరిదిలను రంగంలోకి దింపిన చంద్రబాబు చివరికి రిగ్గింగ్‌తో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైయస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తరఫున నాని ప్రచారం నిర్వహించారు. వైయస్ఆర్ పరిపాలన రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. నంద్యాలలో 80 శాతం అభివృద్ధి పనులు శిల్పానే చేశారని ప్రజలు చెబుతున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి అంతా నేనే చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, ఫరూక్ లు అంతకుముందు గుడ్డిగుర్రాలకు పళ్లు తోమారా అని ధ్వజమెత్తారు. బాబు నంద్యాల సీటును ఓడిపోతే టీడీపీకి పెద్ద దెబ్బ ఉంటుందన్నారు. 

‘‘మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు నంద్యాలలో వందల మందిని రంగంలోకి దింపినా ఫలితం లేదని గ్రహించారు. అందుకే ధన,అధికార బలంతో రిగ్గింగ్‌ చేసైనా గెలవాలని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ఇక్కడ గెలిచేది వైయస్సార్‌సీపీనే’ అని కొడాలి అన్నారు. గడిచిన మూడేళ్లలో చంద్రబాబు చేసిందేమీలేదని, ఎమ్మెల్యేగా, మంత్రిగా గతంలో నంద్యాలను అభివృద్ధి చేసింది శిల్పా మోహన్‌రెడ్డేనని కొడాలి నాని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top