కిరణ్ వ్యాఖ్యలపై అమర్నాథ రెడ్డి ఫైర్

వైయస్ఆర్ జిల్లా:

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  జైలుకు ఎందుకు వెళ్ళారో కిరణ్‌కు తెలియదా అంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. కాంగ్రెస్, టీడీపీ చేసిన కుమ్మక్కు రాజకీయల వల్లనే ఆయన జైలుపాలయ్యారన్నారు. ఓదార్పు యాత్ర కొనసాగితే పుట్టగతులుండవనే జగన్ ను జైలులో పెట్టించారని చెప్పారు. జగన్‌ను జైలులో పెట్టించి చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి యాత్రలు చేయడం కుట్రలో భాగం కాదా అని అమర్నాథరెడ్డి  ప్రశ్నించారు. విశ్వసనీయత ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. ముఖేష్ అంబానీకి సంబంధించి కేజ్రీవాల్  బయటపెట్టిన సీడీపై విచారణ చేపట్టాలి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top