బాబు అండతోనే కిరణ్ ప్రభుత్వం మనుగడ

విశాఖపట్నం, 13 సెప్టెంబర్ 2013:

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై కిరణ్ ‌ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు‌, రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఉండేది కాదని కొణతాల అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విభజనకు ఎలాంటి షరతులు లేకుండానే 2007, 2009 సంవత్సరాల్లో టిడిపి అంగీకారం తెలిపిన సంగతిని కొణతాల ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రె‌స్ అధిష్టానం శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలు‌ చేయాల్సిన అవశ్యకతను కొణతాల రామకృష్ణ వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top