సాయం కోరినా స్పందించడం లేదయ్యా..

శ్రీకాకుళంః తమ గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని రేగడి మండలం అంబకండి గ్రామస్తులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు.సురక్షిత తాగునీరు సౌకర్యం కల్పించాలని, మెరుగైన వైద్యం అందించాలని బాధితులు కోరారు. ఆరువేల మంది గ్రామ జనాభా ఉన్న అంబకండిలో సుమారు ఆరవై మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. నీటికాలుష్యంతో వ్యాధులు సంభవిస్తున్నాయన్నారు.సుమారు 20 మంది వరుకు కిడ్నీ వ్యాధిబారిన పడి మృతిచెందారన్నారు.కిడ్నీ వ్యాధితో పనులు చేసుకోవడం కష్టమవుతుందని, కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు.గ్రామంలో ఉన్న జానాభా అంతా  పేద,బడుగు,బలహీనవర్గాలకు చెందినవారమని, కనీసం వైద్యం కూడా చేయించుకునే ఆర్థి«కస్థోమత కూడా లేదన్నారు.ప్రభుత్వాన్ని సాయం కోరిన స్పందించడంలేదన్నారు. కిడ్నీ రోగులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వం చెబుతుందని..కానీ ఒకరికి కూడా పింఛను రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మన ఏపీలో జరుగుతున్న అవినీతి ఎక్కడ జరగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top