ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన షర్మిల

వల్లభి(ఖమ్మం జిల్లా), 22 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్ర సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లాలో ప్రవేశించింది. పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలలో ఆమె పర్యటిస్తారు. మధిర, పాలేరు, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర చేస్తారు. 200 కిలోమీటర్లు ఇది సాగుతుంది. కృష్ణా జిల్లాలో ఆమె 340.8 కిలోమీటర్లు 27 రోజుల పాటు నడిచారు. 14 నియోజకవర్గాలు, 23మండలాలు 105గ్రామాలలో ఆమె యాత్ర సాగింది. కృష్ణా జిల్లాలో ఆమె 11 రచ్చబండలు, 14 బహిరంగ సభలు, 5 గ్రామ సభలలో ప్రసంగించారు.

Back to Top