ఖమ్మం జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన

ఖమ్మం:

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆవేదనకు గురవుతున్న అన్నదాతలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. అయిదు నియోజకవర్గాలలో ఆమె వరదబాధిత ప్రాంతాలను ఆమె సందర్శిస్తారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం నియోజకవర్గంలోని శివాయిగూడెం, వి.వెంకటాయపాలెం, వైరా నియోజకవర్గంలోని పల్లిపాడు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలోని నారాయణపురం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని చెలమప్పగూడెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. మంగళ, బుధవారాలలో ఆమె తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.

Back to Top