చిత్తకార్తె కుక్కలు.. ఖబడ్దార్‌

  • వైయస్‌ జగన్‌ సింహంలా ప్రజల మధ్య గర్జిస్తే..
  • టీడీపీ నేతలు చిత్తకార్తె కుక్కలా మొరుగుతున్నారు
  • చక్రపాణిరెడ్డితో జననేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు
  • టీడీపీకి దమ్ము, ధైర్యం ఉంటే 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
  • విలువలు, విశ్వసనీయత ఉంటే రండి తేల్చుకుందాం
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అవాకులు, చవాకులు పేల్చితే సహించేది లేదని పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ టీడీపీ నేతలను హెచ్చరించారు. వైయస్‌ జగన్‌ వేలాది మధ్య  నంద్యాల బహిరంగ సభలో ప్రభుత్వ అరాచక, అప్రజాస్వామిక పాలనపై సింహంలా గర్జించారని, రెండు రోజులుగా టీడీపీ నేతలు చిత్తకార్తె కుక్కల్లా మొరుగుతున్నారని మండిపడ్డారు. నంద్యాలలో టీడీపీ ఓటమి ఖాయమని తెలిసి జీర్ణించుకోలేక రోడ్లపైకి వచ్చి వైయస్‌ జగన్‌ దిష్టిబొమ్మలు కాల్చుతున్నారని విమర్శించారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చోటామోటా నాయకులు వైయస్‌ జగన్‌ పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం, అసత్యమని ఆయన అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

టీడీపీ నేతలు చిత్తకార్తె కుక్కల మాదిరిగా రెండు రోజులుగా భౌభౌ అంటూ మొరుగుతున్నారు. వైయస్‌ జగన్‌ నంద్యాలలో సింహంలాగా, వీరుడిలాగా కొన్ని వేల మంది మధ్య గర్జిస్తే..గుంట నక్క చంద్రబాబు పెదవి విప్పకుండా చిత్తకార్తె కుక్కలాంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, చోటామోటా నాలుక తిరగని నాయకులతో మాట్లాడిస్తున్నారు. వైయస్‌ జగన్‌ మాట్లాడిన దాంట్లో ఏమైనా పోరపాటు ఉందా? విశ్వసనీయత, విలువలకు మారుపేరు వైయస్‌ఆర్‌సీపీ, వైయస్‌ జగన్‌. 21 మంది మా ఎమ్మెల్యేలను అడ్డగోలుగా చంద్రబాబు కొనుగోలు చేశారు. ఒక్కరితో కూడా రాజీనామా చేయించలేకపోయాడు. ఒక్క ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మా పార్టీలోకి వస్తాననంటే రాజీనామా చేసి రావాలని వైయస్‌ జగన్‌ షరతు విధించారు. వైయస్‌ జగన్‌ సూచనల మేరకు శిల్పా రాజీనామా చేశారు. బాబు పేరే వెన్నుపోటుదారుడు. ఈ రోజు చిత్తకార్తె కుక్కలను, ఈ మంత్రులను అడుగుతున్నాను. మా పార్టీలో గెలిచి మంత్రి అయిన వ్యక్తిని అడుగుతున్నాను. మీకు విలువలు, విశ్వసనీయత ఉంటే రండి తెల్చుకుందాం. మేం ఎమ్మెల్సీ పదవిని నంద్యాల మీటింగ్‌లో మీ ముఖాన కొట్టాం. ఆ సత్తా మీకు ఉందా? వైయస్‌ జగన్‌ ఏమన్నారని చిలువలు, వలువలుగా అంటున్నారు. రామాయణాన్ని ఉదహరిస్తూ  రాక్షసుడు, రావణాసురుడు, రాముడు గురించి చెప్పారు. రాముడు లాంటి ఎన్‌టీ రామారావును మానసికంగా చంపింది ఎవరయ్యా. ఎన్టీఆర్‌ పార్టీని లాక్కుంది ఎవరు, కత్తులు, క్రరలు, చెప్పులు విసిరింది ఎవరు. సిగ్గులేకుండా ఎన్‌టీఆర్‌ను మానసికంగా చంపి, మళ్లీ ఆయన ఫోటోలకు పూలమాలలు వేస్తున్నారు. ఈ కుక్కలు వైయస్‌ జగన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నాయి.  మీడియా ముందు నాలుక తిరగని వెదవలు వచ్చి మాట్లాడుతూ మా నాలుకలు కోస్తామంటారా? చింతకాయలు కూడా రాలవు. రండి ఎక్కడికి వస్తారో..చెప్పండి. వైయస్‌ జగన్‌ నంద్యాలలో మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మేం క్షమాపణ చెబుతాం. చంద్రబాబు రావణుడు, రాక్షసుడు. ఈ మధ్య ఒకడు వైయస్‌ జగన్‌ దిష్టిబొమ్మ కాల్చుతూ ఒళ్లు కాల్చుకున్నారు. చిత్తకార్తె కుక్కలను బోన్‌లో పెడతాం. మంత్రులు ఖబడ్దార్‌..జాగ్రత్త.. ప్రజాస్వామ్యంలో ధర్నా చేయాలంటే అనుమతి తీసుకోవాలి. వైయస్‌ జగన్‌ దిష్టిబొమ్మలు అన్ని చోట్లా తగుల బెడుతా ఉంటే పోలీసు వ్యవస్థ ఏమైంది. దిష్టిబొమ్మలు తగులపెట్టిన టీడీపీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేయకపోతే మేం కూడా రోడ్డుపైకి వస్తాం. బాబు దిష్టిబొమ్మలు ఊరువాడాలో తగులబెడతాం. పోలీసు వ్యవస్థ ఇలాంటివి దగ్గరుండి చేయిస్తుందా అని జోగి రమేష్‌ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలు తిరుగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top