()కేసీఆర్ పాలన బూటకపు పాలన()రాజకీయ దురుద్దేశంతోనే జిల్లాల విభజన
హైదరాబాద్ః  కేసీఆర్ పాలనంతా బూటకపు పాలన అని టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ దురద్దేశంతోనే కేసీఆర్ జిల్లాలను పునర్ విభజన చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల పునర్ విభజన అంశం కోర్టుల్లో నిలబడదన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు...
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...()తమ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని కేసీఆర్ సిగ్గుమాలిన చర్యలకు పాల్పడ్డారు. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలి. ()సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గులేదు. దొంగతనంగా బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు. ()అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. ఒక్కరికైనా ఉద్యోగమిచ్చారా. ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా . రైతన్నల మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి.()ఆర్టికల్ 170 ప్రకారం జిల్లాల పునర్విభజన జరగాలి. 2023 వరకు జిల్లాల ఏర్పాటు ఎట్టిపరిస్థితుల్లో జరగదు. () వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ. టీఆర్ఎస్ దౌర్జన్యాలను వైయస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది.()డీపీఆర్ రిపోర్ట్ లేకుండా 2 లక్షల ప్రాజెక్ట్ లను చేస్తున్నారు. ఎవరికోసం చేస్తున్నారు. రైతుల మీద ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారా అని గట్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.