కనగల్ నుంచి షర్మిల 65వ రోజు పాదయాత్ర

కనగల్‌ (నల్గొండ జిల్లా), 13 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 65వ రోజు బుధవారం ఉదయం నల్గొండ జిల్లా కనగల్‌ శివారు నుంచి ప్రారంభమైంది. వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వై‌యస్ అభిమాను‌లు తన పదంలో పదం కలిపి వెంట రాగా శ్రీమతి షర్మిల ముందుకు కదిలారు.

నల్లగొండ నియోజకవర్గంలోని అమ్మగూడెం, గౌరారం, మారేపల్లి, అన్నారం ఎక్సు రోడ్డు, యాచారం మీదుగా శ్రీమతి షర్మిల నేటి పాదయాత్ర కొనసాగుతుంది. పలు చోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా సమస్యలను ఆమె అడిగి తెలుసుకుంటారు. బుధవారం రాత్రికి శ్రీమతి షర్మిల యాచారం శివార్లలో బస చేస్తారు. ఈ రోజు మొత్తం 15.8 కిలో మీటర్లు నడిచే శ్రీమతి షర్మిల గౌరారంలో మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.
Back to Top