ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను తిప్పికొడ‌దాం

శ్రీ‌కాకుళం(రాజాం): ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడ‌దామ‌ని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కార్యాలయంలో రేగిడి మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే భాద్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతోపాటు ప్రత్యేక హోదా, రుణమాఫి, ప్రత్యేక రైల్వేజోను, నిరుద్యోగభృతి వంటివి ఎలా నెరవేర్చలేకపోయిందో ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని తెలిపారు. అలాగే టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా రేగిడి మండలం సంకిలిగ్రామంలో వైఎస్‌ విగ్రహా ఏర్పాట్లుపై కూడా నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, జిల్లా కార్యదర్శి టంకాల అచ్చెన్నాయుడు, నాయకులు నెల్లి పెంటన్నాయుడు, కింజరాపు సురేష్, కురిటి శ్రీరామమూర్తినాయుడు, వంజరాపు అశోక్, మజ్జి శ్రీనివాసరావు, రాయపురెడ్డి కృష్ణారావు, బంకి నారన్నాయుడు, వావిలపల్లి వెంకటరావు, లావేటి అప్పలనాయుడు, బుడితి రాధాకృష్ణ, కెంబూరు అప్పలనాయుడు, గంటా మోహనరావు, కరణం గోవిందరావు, గోగుల శంకర్, బూడి ఆదినారాయణ, శాసపు జనార్దనరావు, పట్టా మురళి, కొమ్ము దుర్గారావు, కర్నేన రామినాయుడు, కొవ్వాడ శ్రీరాములు, గుణుపూరు రాము, బంకి భుజంగరావు, ముంజేటి కిషోర్, రాముయాదవ్, మీసాల ఉమా, పేడ్డ రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Back to Top