కాపీలతో బాబు డాబు! : విజయమ్మ ఎద్దేవా

హైదరాబాద్‌, 6 సెప్టెంబర్‌ 2012 : వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ‌కార్యక్రమాలను కాపీ కొట్టడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారని వైయస్ విజయమ్మ ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పథకాన్ని‌ తానే ప్రవేశపెట్టానంటూ ఆయన చెప్పుకోవడంపై విజయమ్మ నిప్పులు చెరిగారు. చంద్రబాబు చర్యలపై ఆమె మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చేస్తుంటే చంద్రబాబు కనీస బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద రెండు రో్జుల ఫీజు దీక్ష ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు తీరును విజయమ్మ ఎండగట్టారు. వేలాది మంది విద్యార్థుల సంఘాభావం సాక్షిగా చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను ఆమె తప్పుబట్టారు.
బీసీ రిజర్వేషన్ల పట్ల బాబు అనుసరిస్తున్న వైఖరిపై విజయమ్మ నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో బీసీలకు వంద టిక్కెట్లు ఇస్తానన్న చంద్రబాబు కేవలం 47 మాత్రమే ఇచ్చారని, మహానేత వైయస్‌ఆర్‌ అయితే, తాను చెప్పకపోయినా వారికి 67 టిక్కెట్లిచ్చారని ఈ సందర్భంగా విజయమ్మ గుర్తు చేశారు.

Back to Top