జ‌గ‌న్ వ‌స్తేనే ప్ర‌జ‌ల‌కు న్యాయం

గొల్లప్రోలు (రాజ‌మండ్రి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట ఇస్తే త‌ప్ప‌రని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు పెండెం దొర‌బాబు అన్నారు. చంద్ర‌బాబు మాదిరి మోసం  చేయ‌ర‌ని, జ‌గ‌న్ వ‌స్తేనే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని  దొర‌బాబు అన్నారు.  మండలంలోని ఏకే మల్లవరంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ముందుగా సుబ్రహ్మణ్యస్వామి గుడిలో పూజాధికార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కన్వీనర్‌ అరిగెల రామయ్యదొర ఆధ్వర్యంలో గ్రామంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఇంటింటా నవరత్నాలను వివరించారు. జగన్‌ సీఎం అయితే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమప‌థ‌కాలను తెలియచేశారు. మాటమీద నీలబడే వ్యక్తి జగన్‌అని ప్రజలకు నొక్కి చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలను , ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని వివరించారు. పలువుర్ని వైయ‌స్ఆర్‌కుటుంబంలో చేర్చారు. 

తాజా ఫోటోలు

Back to Top