30న అనంతపురంలో నయవంచన దీక్ష


వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ
 విశాఖ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 30న అనంతపురంలో నయవంచన దీక్ష చేపడుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరోమారు ప్రజలను వంచించారని ఆయన విమర్శించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏం మాట్లాడారో? ఏ రకంగా నిరసన తెలియజేశారో ఢిల్లీలోనే చెబుతామని ప్రకటించి ఎందుకు వాయిదా వేశారని ఆయన ప్రశ్నించారు. 
 
Back to Top