జగన్మోహన్‌రెడ్డి నివాసం వద్ద పండుగ సందడి

హైదరాబాద్, 24 సెప్టెంబర్ 2013:

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరై....నేడు విడుదల కానున్న సందర్భంగా ఆయన నివాసం లోటస్‌పాండ్లో సందడి వాతావరణం నెలకొంది. అభినందనలు తెలిపేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చినవారితో శ్రీ జగన్‌ నివాసం లోటస్‌పాండ్ పరిసరాల్లో పండుగ వాతావరణ‌ం నెలకొన్నది. శ్రీ జగన్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపేందుకు‌ పలువురు పార్టీ నాయకులు కూడా లోటస్‌పాండ్కు తరలి వస్తున్నారు.
తెలంగాణ జిల్లాల్లో ఆనందోత్సవాలు

తెలంగాణ జిల్లాల్లో ఆనందోత్సవాలు:
పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు కావడంతో తెలంగాణా జిల్లాల్లోని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. అనేక చోట్ల వారు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టి, డాన్సులు చేస్తూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనితో తెలంగాణ జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజల మధ్యకు వస్తుండడంతో ప్రజల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. శ్రీ జగన్‌కు బెయిల్ మంజూరు కావడంతో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున జై జగ‌న్ నినాదాలు చేశారు.

జగన్ బెయిల్ వార్తతో తెలంగాణ జిల్లాల్లో‌ని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. శ్రీ జగన్‌కు బెయిల్ రావటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది.

తాజా వీడియోలు

Back to Top