జోరువానలోనూ షర్మిల పాదయాత్ర

అనంతపురం:

వానలో తడుస్తూనే షర్మిల ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. బురదలో దిగి రైతుల సమస్యలు శ్రద్ధగా వింటున్నారు. మిరప చేనును పరిశీలించారు. రైతలు, మహిళలు కూడా వానను లెక్కచేయకుండా ఆమె అడుగులో అడుగేస్తున్నారు. రాజన్న రాజ్యం రావాలని వారు ఆంకాంక్షిస్తున్నారు. వైయస్ఆర్ ఉన్నప్పుడు సమయానికి పొలాలకు నీరందేదని చెప్పారు. కరెంటు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వారు ఫిర్యాదు చేశారు.  గురువారం ఉదయం ఆమె వర్షంలోనే యాత్రను ప్రారంభించారు. శుక్రవారమూ అదే పరిస్థితి నెలకొంది. షర్మిలకు దారిపొడవునా ప్రజలు స్వాగం పలికారు.

Back to Top