బీసీ విభాగ అధ్యక్షుడిగా జంగా క్రిష్ణమూర్తి ప్రమాణస్వీకారోత్సవం

మాచర్లః గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి రాష్ట్ర వైయస్సార్‌సీ బీసీ విభాగ అధ్యక్షుడిగా బుధవారం గుంటూరులో ప్రమాణ స్వీకారమహోత్సవానికి నియోజకవర్గం నుంచి వందలాది మంది వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్లు కామనబోయిన కోటయ్యయాదవ్, బత్తుల ఏడుకొండలు, జిల్లా వైయస్సార్‌సీపీ న్యాయవాది విభాగ నాయకుడు జీవీ, రెంటచింతల జెడ్పీటీసీ నవులూరి భాస్కరరెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి షేక్‌ కరిముల్లా, వెల్దుర్తి మండల నాయకులు కంచర్ల నాగరాజు, రెంటచింతల మండల నాయకులు పేర్ల ముత్తయ్య, రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యులు మోర్తాల ఉమామహేశ్వరరెడ్డి, రెంటచింతల బీసీ విభాగ అధ్యక్షుడు రామయ్య, మాచర్ల మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నోముల కృష్ణ, అడిగొప్పల గ్రామ నాయకులు కుర్రా సాంబశివరావు, నాలి రామయ్య, నలబోతుల వెంకటేశ్వర్లు, డేగల నాగేశ్వరరావు, దుర్గి మండల ఎస్సీసెల్‌ విభాగ అధ్యక్షుడు రాయపాటి నాగేశ్వరరావు, తాళ్ల అంబారావు, మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

Back to Top