జనసంద్రమైన పటాన్‌చెరు

పటాన్‌చెరు:

పటాన్‌చెరు.. ప్రజలతో నిండిపోయింది. అశేష జనవాహినితో దారులన్నీ కిక్కిరిశాయి. మహిళాలోకం వెల్లువెత్తింది. యువత కదం తొక్కింది. మైత్రి మైదానం జనసంద్రమైంది. జగన్నినాదం మార్మోగింది. దివి నుంచి విమానం ఆశీస్సుల సుమాల జల్లు కురిపిం చింది. ప్రజలతో సభా స్థలం నిండిపోగా.. లోపల స్థలంలేక వేలాది మంది అభిమానులు వెలుపలి నుంచి సభా కార్యక్రమాలను తిలకించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వై.యస్. విజయమ్మ గురువారం సాయంత్రం పటాన్‌చెరులో నిర్వహించిన బహిరంగ సభ  విజయవంతమైంది. పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరూ తరలిరావడంతో సభావేదిక కిక్కిరిసింది. ఇక్కడ ఓ రాజకీయ పార్టీ బహిరంగ సభకు ఈ స్థాయిలో స్పందన రావడం ఇదే ప్రథమమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పటాన్‌చెరు మాజీ ఎంపీపీ గూడెం మహిపాల్‌రెడ్డి మద్దతుదారులతో కలిసి శ్రీమతి విజయమ్మ సమక్షంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
హార్థిక స్వాగతం
     శ్రీమతి వైయస్ విజయమ్మ సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో లింగంపల్లి చౌరస్తాకు చేరుకోగా వందల మంది  కార్యకర్తలతో కలిసి భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి వందల సంఖ్యలో బైక్‌లు, కార్లు, ఆటోలు, అశ్వాలతో ర్యాలీగా బయలుదేరి రాంచంద్రాపురం చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సి.అంజిరెడ్డి ప్రజ లకు ఉచితంగా నీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకర్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి పటాన్‌చెరు చేరుకుని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభావేదికపైకి శ్రీమతి విజయమ్మ చేరుకుంటుండగా.. అప్పటివరకు సభా ప్రాంగణంలో నేలపై కూర్చుని ఉన్న వేల మంది ప్రజలు లేచి నిలబడి అపూర్వ స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి శ్రీమతి విజయమ్మ పూలమా లవేసి నివాళులర్పించారు. ఢిల్లీలో హత్యాచారానికి గురైన నిర్భయ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించడంతో పాటు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. అనంతరం శ్రీమతి విజయ మ్మ మహిపాల్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top