<strong>తిరుపతి, 17 అక్టోబర్ 2012:</strong> తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి బుధవారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర చేయడం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పేటెంట్ హక్కు అన్నారు. వైయస్‌ఆర్ గతంలో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. ప్రజల కడగండ్లు తుడవడానికే షర్మిలమ్మ ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. షర్మిలమ్మ పాదయాత్ర సజావుగా జరిగేలా ఆశీస్సులు అందించాలని కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని కోరుకోవడానికి తాను తిరుమల వచ్చానని సుబ్బారెడ్డి తెలిపారు.