<br/>తూర్పు గోదావరి: మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ కత్తిపూడి వద్ద జక్కంపూడి రామ్మోహన్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో జక్కంపూడికి ఉన్న స్నేహాన్ని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. జక్కంపూడి ఆశయ సాధనకు కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు పాల్గొన్నారు.