జగన్ విడుదలకు జనం ఎదురు చూపు

గుంటూరు:వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఎప్పుడు లభిస్తుందా అని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. వైయస్ఆర్ చేపట్టిన పథకాల అమలు ఆయన తనయుడు  జగన్ ద్వారానే సాధ్యమన్నారు. జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ సోమవారం గుంటూరులోని బీఆర్ స్టేడియం నుంచి పెదకాకాని దర్గా వరకు పార్టీ నేత షేక్ షౌకత్ చేపట్టిన పాదయాత్రను మర్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ అభిమాన నేత కోసం అనేక చోట్ల ప్రార్థనలు, పూజలు చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా షౌకత్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు ఆర్కే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై తమకు అపార నమ్మకం ఉందన్నారు. ఎవరెన్ని వేధింపులకు, ఆటంకాలకు గురి చేసినా జగన్ ప్రజల్లోకి వచ్చి మమేకం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ దుష్టశక్తులు ఎన్ని ఆటంకాలు కలిగించినా  జగన్‌కు బెయిల్ రావడం ఖాయమన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు జగన్ మాత్రమే నెరవేర్చగలరన్నారు. పాదయాత్ర చేపట్టిన పార్టీ నేత షౌకత్ మాట్లాడుతూ జగన్ జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మద్దతుగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, యువజన విభాగం ఐదు జిల్లాల కన్వీనర్ వనమా బాలవజ్రబాబు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, పార్టీ మైనార్టీ సెల్ నగర కన్వీనర్ మార్కెట్‌బాబు, ఎస్సీ సెల్ నేత వై.విజయ్‌కిషోర్, పార్టీ నాయకులు ఎంఎ హకీం, తోట ఆంజనేయులు, ఐజక్ ప్రభాకర్, ఎండీ కబీర్, మెహమూద్, సమీవుల్లా, ఎం.అనిల్‌కుమార్, నూర్, షేక్ కరీముల్లా, మాజీ ఎంపీటీసీ ఏటుకూరి విజయసారధి, అంగడి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, మహిళా నేతలు నాగేశ్వరి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తొలుత పార్టీ నేతలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ స్టేడియం ఎదురుగా ఉన్న ఆర్కేకి చెందిన స్థలం వద్ద ప్రారంభమైన యాత్ర ఆర్టీసీ బస్టాండు, ఫై్ల ఓవర్ మీదుగా ఆటోనగర్, పెదకాకాని హైవే మీదుగా దర్గాకు చేరింది. ఆర్కే గుంటూరు నగరం నుంచి దర్గా వరకు యాత్రలో పాల్గొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్మికులతో కలిసి పార్టీ ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ షేక్ గులాం రసూల్ పాదయాత్రలో పాల్గొని తన మద్దతు తెలిపారు.
ప్రత్యేక ప్రార్థనలు..
గుంటూరు నుంచి ప్రారంభమైన యాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు పెదకాకాని దర్గా వద్దకు చేరుకుంది. దర్గా ముతవల్లీలు షేక్ గౌస్ మొహిద్దీన్, షేక్ మహబూబ్ అలి, షేక్ బాషీద్‌లు స్వాగతం పలికారు.  జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పెదకాకాని దర్గాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

Back to Top