'జగన్ సీఎం అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయి'

బొబ్బిలి: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుతాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, బొ బ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్‌వీయస్కేకే రంగారావు అన్నారు. రామభద్రపురం మండలం ముచ్చర్లవలస గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఆయన సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా స్థానికులనుద్దేశించి రంగారావు మాట్లాడారు. మహానేత మరణించిన తరువాత రాష్ట్రంలో పాలన అథోగతి పాలైందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మడక తిరుపతినాయుడు, కర్రోతు తిరుపతిరావు, రాయలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top