'జగన్ ప్రభంజనా‌న్ని ఆపే శక్తి ఎవరికీ లేదు'

హుస్నాబాద్‌ (కరీంనగర్‌ జిల్లా): వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డు‌కునే శక్తి ఎవరికీ లేదని పార్టీ నాయకుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో శనివారం చేపట్టిన ‌'జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజ‌లూ శ్రీ జగన్ ‌ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టిందని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా మద్దతు తెలుపుతున్నారని ఈ జన ప్రభంజనాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో 1,356 మంది సంతకాలు చేశారు. నాయకులు సింగిరెడ్డి ఇందిరారెడ్డి, మాచమల్ల కిష్టయ్య, మండల, పట్టణ కన్వీనర్లు బొంగోని శ్రీనివాస్‌గౌడ్, వరయోగుల అనంతస్వామి, కర్ర జగ్గారెడ్డి, కొమ్మెర నర్సింహారెడ్డి, గట్టు మల్లేశం, జనగామ సదానందం, జూపాక సుదర్శ‌న్, మంచికట్ల భారతి, చింతకింది మణెమ్మ, వేణుమాధ‌వ్, ‌అశోక్‌యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top