జగన్‌ను ఏం చేయదలచుకున్నారు?: దాడి

హైదరాబాద్, 10 జూన్‌ 2013:

చంద్రబాబు నాయుడుపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు దాడి వీరభద్రరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు రాయమంటేనే యనమల రామకృష్ణుడు లేఖలు రాస్తున్నట్లున్నారని ఆయన సోమవారం హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని దాడి వీరభద్రరావు సవాల్ ‌చేశారు.

నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ద్వారా చంద్రబాబు తన విశ్వసనీయతను తానే చంపుకుంటున్నారని దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. ఎదుటి వారిని ఎలా దెబ్బతీయాలనే చంద్రబాబు తరచూ ఆలోచిస్తుంటారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని దాడి సూచించారు. శ్రీ జగన్ ను జై‌లులో కూడా ఉండనివ్వరా, ఆయనను ఏం చేయదలచుకున్నారంటూ దాడి విరుచుపడ్డారు. జైలులో శ్రీ జగన్ గదికి అడ్డంగా గోడలు ఏమైనా కట్టాలా అని‌ దాడి సూటిగా ప్రశ్నించారు.

టిడిపిలో తాను ఉన్నప్పుడు చంచల్‌గూడ జైలులో నూకారపు సూర్యప్రకా‌శరావును కలిశానని, నియమ నిబంధనల మేరకే జైళ్లు పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సిబిఐ చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ గా మారి‌పోయిందని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు.

Back to Top