జగన్‌కు జనం అండ

తిరుపతి:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై ప్రభుత్వం, సీబీఐ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.  మున్సిపల్ కార్పొరేషన్ కార్యాయం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో ఆత్మలాగా దివంగత ముఖ్యమంత్రి డాకట్ర్ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి నిలిచిపోయారని గుర్తుచేశారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తమ సంతకం ద్వారా శ్రీ జగన్ ఏ తప్పూ చేయలేదని, ఆయన వెంటే తామంతా ఉన్నామని చాటడం సంతోషకరమన్నారు.

Back to Top