జగన్ కోసం కదులుతున్న జనం

విజయనగరం:

‘జగన్ కోసం... జనం సంతకం’ అనే కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. విజయనగరం పట్టణంలో  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఆటోవాలాలు.. ఇలా అన్ని వర్గాల వారూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  విడుదల కోరుతూ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా  జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కక్షపూరితంగానే జైల్లో నిర్బంధించారని చెప్పారు. ఏ తప్పూ చేయని జగన్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. జిల్లా తరఫున రెండు లక్షల సంతకాలు సేకరిస్తామని తెలిపారు. ఇప్పటికే 50 వేలు పూర్తయ్యాయని తెలిపారు. సేకరించిన సంతకాలను రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి పంపిస్తామని వివరించారు.

Back to Top