<strong>బొబ్బిలి (విజయనగరం జిల్లా) :</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా, ఆయనను విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన 'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమానికి బొబ్బిలిలో విశేష స్పందన లభించింది. జనకోటి సంతకం కార్యక్రమాన్ని ముందుగా పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన) ప్రారంభించారు. పార్టీ సేవాదళ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోర్టు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బేబీనాయన తొలి సంతకం చేశారు. సేవాదళ్ జిల్లా కన్వీనర్ తూముల రాంసుధీర్, పలువురు పట్టణ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.<br/>మంగళవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిల్లో ప్రార్థనలు చేసి తిరిగొచ్చిన పలువురు క్రైస్తవ సోదరులు 'జగన్.. జనం సంతకం' కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని కుటుంబ సమేతంగా సంతకాలు చేశారు. దినసరి కూలీలు, రిక్షాలు నడిపే కార్మికులు, హోటల్ నిర్వాహకులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతకం కార్యక్రమంలో పాల్గొన్నారు.<br/>గరుగుబిల్లి మండల కేంద్రంలో వైయస్‌ఆర్‌సిపి చేపట్టిన జగన్ కోసం.. జనం సంతకం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు.