జగన్ కోసం జనం నిరీక్షణ

తిరుపతి:

అక్రమ నిర్బంధంలో ఉన్న వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విడుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. జైలు నుంచి శ్రీ జగన్మోహన్‌ రెడ్డి విడుదలై జనం మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ బాలాజీ కాలనీ, నెహ్రూనగర్ ప్రాంతాల్లో  పార్టీ శ్రే ణులు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే శ్రీ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అందుకే ఆయన జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఇష్టారాజ్యంగా కరెంట్ చార్టీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్మోందని చెప్పారు.

Back to Top