హైదరాబాద్ :  జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై తమ గుండెల్లో అభిమానం ఎంతగా గూడు కట్టిందో రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలూ, ప్రజలు నిరూపిస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తమ నేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటకు రావడానికి వీల్లేకుండా చేస్తున్న వైనం వారిని ఎంత కలచివేస్తోందో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. 'జగన్ కోసం,, జనం సంతకం' పేరిట చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని పార్టీ శ్రేణులు నడుపుతున్న తీరు వారి నిబద్ధతను వెల్లడిస్తోంది. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాక.. నెల్లూరు నుంచి ఇచ్ఛాపురం వరకూ పెద్ద ఎత్తున ఉద్యమంలా సంతకాలను సేకరిస్తున్నారు. వీటిని తీసుకువెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేసేందుకు సంసిద్ధులు అవుతున్నారు.
ఆదిలాబాద్: 'జగన్ కోసం.. జనం సంతకాలు' చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించారు. శ్రీ జగన్‌కు బాసటగా జనం స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై బనాయించిన కేసులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్మల్‌లో మాజీ ఎంపి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.
తొలుత తాను సంతకం చేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి, అధికార ప్రతినిధి మహిపాల్‌రెడ్డి, బిసి సెల్ కన్వీనర్ అల్లాడి వెంకటరమణ, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ వాహెద్‌ఖాన్, ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో ప్రచార కమిటీ నాయకులు అనిల్‌కుమార్, సలీం పాషా, శ్రీనివాస్ గౌడ్, ఫారుఖ్ రంజాని, గంగారెడ్డి, బోథ్‌లో మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలోనూ, మంచిర్యాలలో వైయస్ఆర్‌సిపి నాయకులు బోడ ధర్మేందర్, పెంట రమేష్, శ్రావణ్‌గౌడ్ ఇతన నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
అమలాపురం: తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజులుగా ఉవ్వెత్తున ఉద్యమంలా సాగుతున్న సంతకాల సేకరణలో సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురు అభిమానులు, పార్టీ శ్రేణులు సంతకం చేసేందుకు బారులు తీరారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, క్రమ శిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎం.పి. ఎజెవిబి మహేశ్వరరావు ఈ శిబిరంలో పాల్గొన్నారు.
తునిలో పార్టీ నియోజకవర్గం నాయకుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగగా, రాయవరంలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, మాజీ ఎంపిపి శిరిపురపు శ్రీనివాసరావు, పి.గన్నవరంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాల్, మందపాటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
కోటి సంతకాలు ప్రభుత్వానికి చెంపపెట్టు:గుంటూరు: శ్రీ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా సేకరిస్తున్న కోటి సంతకాలు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివని పార్టీ జిల్లా పరిశీలకులు పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. పార్టీ మైనార్టీ విభాగం నగర కన్వీనర్ మార్కెట్‌బాబు ఆధ్వర్యంలో నగరంలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కాంగ్రెస్, టిడిపిల కుట్ర:శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయట ఉంటే తమ ఆటలు సాగవన్న భయంతో కాంగ్రెస్, టిడిపిలు కలసి కుట్ర పన్ని జననేతను జైలుకు పంపించాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చెప్పారు. శ్రీ జగన్ నిర్దోషి అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, శ్రీ జగన్‌ను సిఎంగా చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేతిలో సిబిఐ కీలుబొమ్మగా వ్యవహరిస్తోందన్నారు.
బారులు తీరిన జనం సంతకం! :శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా మార్కెట్ వద్ద నిర్వహించిన శిబిరంలో సంతకాలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు కూడా వేచి ఉండి సంతకాలు చేశారు. కొంతమంది నిరక్షరాస్యులు తమ పేర్లు చెప్పి వేలిముద్రలు వేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగనే సీఎం :పెద్దపల్లి: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద జగన్ కోసం.. జనం సంతకాల సేకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. విలేకరులతో మాట్లాడుతూ.. జనమంతా జగన్‌వైపే చూస్తుండడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై ఆయనను జైలుకు పంపాయని ఆరోపించారు.
జగన్ నిర్బంధంపై జనం నిరసన :ఖమ్మం: శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని జైలులో నిర్బంధించడాన్ని నిరసిస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తోందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, సీఈసీ సభ్యుడు బాణోత్ మదన్‌లాల్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని వారు ఖమ్మంలో ప్రారంభించారు. అనంతరం, మాట్లాడుతూ.. ప్రతి మండలం నుంచీ 10 నుంచి 15 వేల సంతకాలు సేకరించేందుకు ప్రణాళక సిద్ధం చేశామన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పాదచారులు, వాహన చోదకులు నాయకుల వద్దకు స్వచ్ఛందంగా వచ్చి, సంతకాలు చేశారు.
యజ్ఞంలా సంతకాల సేకరణ: కల్లూరు: శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణను యజ్ఞంలా చేయాలని కర్నూలు జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి కోరారు. తొలి సంతకం చేసి సేకరణకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి పత్తికొండ, డోన్, శ్రీశైలం నేతలు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరెడ్డి హాజరయ్యారు.
కక్ష సాధింపు ఆపాలి: ఎడ్మ
మహబూబ్‌నగర్: రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని కాంగ్రెస్, టిడిపిలు వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై ఇప్పటికీ కుట్రలను కొనగిస్తున్నాయని పాలమూరు జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి దుయ్యబట్టారు. శ్రీ వైయస్ జగన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దమనకాండను ఆపాలని కోరుతూ ఆ పార్టీ చేపట్టిన ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో కిష్టారెడ్డి ప్రారంభించారు.
కోటి సంతకాలతో రాష్ట్రపతిని కలుస్తాం:
భువనగిరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రపూరిత చర్యలను రాష్ట్రపతికి తెలియజేయడానికి కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు పార్టీ దక్షిణ తెలంగాణ సమన్వయకర్త జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి 200 రోజులైనా బెయిల్ రాకుండా సిబిఐ, అధికార కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. జనవరి 1వ తేదీ వరకు కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
జగన్ విడుదల కోసం...:నెల్లూరు: యువనేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడు విడుదలవుతారా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని వైయస్ఆర్ సిపి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పార్టీ పిలుపు మేరకు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో జగనన్న విడుదల కోసం కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాలు చేసేందుకు వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దసంఖ్యలో జనం ఆసక్తి చూపారు.
జన సంతకానికి విశేష స్పందన :శ్రీకాకుళం : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు చేపట్టిన ‘జగన్ కోసం.. జనం సంతకం’కు విశేష స్పందన లభిస్తోంది. సోమవారం స్థానిక డే అండ్ నైట్ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి వయసుతో సంబంధం లేకుండా అశేషంగా ప్రజలు తరలివచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన సిబిఐ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని దోషిగా చిత్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. యూపీలో ఓ కేసులో అక్కడి సిఎం అఖిలేష్ భార్య పేరును సిబిఐ చేర్చిందని, అయితే ఆమె అధికారంలో లేదని చెప్పి ఆ తర్వాత తొలగించిన విషయాన్ని కల్యాణి తెలిపారు.
అఖిలేష్ భార్య పేరును ఏ ప్రాతిపదికన తొలగించారో ఇక్కడా అదేవిధంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి పేరునూ తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్ మాట్లాడుతూ, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారని చెప్పారు. సిబిఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌గా పనిచేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర విమర్శించారు. సంతకాల సేకరణకు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యుడు అంధవరపు సూరిబాబు అన్నారు.
కక్ష సాధింపు చర్యలు తక్షణం ఆపండి:
విజయనగరం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై కక్షసాధింపు చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం, సిబిఐ తక్షణమే ఆపుచేయాలని వైయస్ఆర్ సిపి విజయనగరం జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ‘జగన్ కోసం... జనం సంతకం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెన్మత్స మాట్లాడుతూ, శ్రీ వైయస్ జగన్‌పై కక్ష సాధింపు చర్యలను తక్షణమే ఆపాలని కోరారు. ఈ విషయం రాష్ర్టపతికి కొటి సంతకాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలో లక్ష సంతకాలు సేకరించాలని నిర్ణయించామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేస్తున్నారని, శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదలకు తమ వంతు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ప్రజలంతా శ్రీ వైయస్ జగన్‌పై అభిమానంతో సంతకాలు చేస్తున్నారని, ఇది హర్షించదగ్గ విషయమన్నారు.
కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన సిబిఐ అసలు వాస్తవాలను గ్రహించకుండా శ్రీ జగన్‌ను దోషిగా చిత్రీకరించడానికే కుట్రలు పన్నుతోందని పెన్మత్స నిప్పులు చెరిగారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, పక్షపాతంతో సిబిఐ పనిచేస్తోందని, ఇది చాలా దారుణమన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని చెప్పారు. అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చి, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకే జననేతను 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, దీన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని పెంచాలని కోరారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్, పార్టీ నాయకులు జనాప్రసాద్, గొర్లె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జగన్ కోసం.. జన సంతకం:గోపాలపురం : శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి, బెయిల్ రాకుండా చేస్తున్న కుట్రలకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని పార్టీ విశాఖపట్నం జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పారు. గోపాలపురంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విశాఖ జిల్లాలోనే అత్యధికంగా సంతకాలు సేకరించాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కృషి చేయూలని కోరారు.
గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరును వ్యతిరేకించడం వల్లే కేసుల పేరుతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై జనం స్పందనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి తెలియజేయడానికే కోటి సంతకాల సేకరణ చేపట్టామన్నారు.