జగనన్న సిఎం అయ్యాక 30 కిలోల చౌకబియ్యం

చిన్నకడుబూరు 15 నవంబర్ 2012: జగనన్నముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి కుటుంబానికీ 30 కిలోల చౌకబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని షర్మిల హామీ ఇచ్చారు. గురువారం 29 వ రోజు పాదయాత్రలో భాగంగా ఆమె కర్నూలుజిల్లాలోని చిన్నకడుబూరులో మహిళలతో రచ్చబండ నిర్వహించారు. మహిళల సమస్యలను ఒక్కటొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం ఎంత వస్తోందని షర్మిల వారిని అడుగగా ఒకొక్కరికీ నాలుగుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారని మహిళలు చెప్పారు. దానికి స్పందించిన షర్మిల జగనన్న సిఎం అయిన వెంటనే కుటుంబానికి 30 కిలోల చొప్పున బియ్యం ఇస్తారని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఇప్పుడున్న ప్రభుత్వం సరిగా రుణాలివ్వడం లేదని షర్మిల విమర్శించారు. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు 2008లో పన్నెండు వేల కోట్ల రూపాయల మేరకు రుణాలు రద్దు చేయించారనీ, మీ రుణాలు అప్పుడే మాఫీ అయిపోయాయనీ ఆమె మహిళలతో అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వడ్డీ కట్టమని పీక్కుతింటోందన్నారు. జగనన్న సిఎం అయ్యాక వడ్డీ మాఫీ చేసే విషయం పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. కరెంటు సమస్యలను కూడా మహిళలు షర్మిలకు చెప్పుకుని వాపోయారు. కరెంటు కష్టాలకు ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే కారణని షర్మిలవారితో అన్నారు. వానలు లేక, పంటలు లేక ఎక్కడికి వలస పోవాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా, త్వరలోనే మీ కష్టాలన్నీ తీరతాయని షర్మిల వారిని ఓదార్చారు. షర్మిల వెంట పాదయాత్రలో మంత్రాలయం  టిడిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top