పులివెందుల పుల‌క‌రించింది

రాష్ట్రంలో అనేక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అలుపెర‌గ‌కుండా పోరాటం చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ పులివెందుల ను మాత్రం గుర్తించుకొంటున్నారు. వీలు దొర‌కిన‌ప్పుడ‌ల్లా అక్క‌డ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఈ సారి ప‌ర్య‌ట‌న‌లో మూడో రోజు నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేట్లుగా క్యాంపు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ కూర్చొని ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. అభిమానులు, కార్య‌క‌ర్త‌ల్ని ప‌ల‌క‌రిస్తూ యోగ క్షేమాలు విచారించారు.
ఈ ప‌ర్య‌ట‌న‌లో వైఎస్ జ‌గ‌న్ లింగాల‌ మండలం వెలిదండ్ల గ్రామ సమీపంలో లింగాల కుడికాలువను కాలువ స్థితిగతులపై రైతులు, అధికారులతో చర్చించారు.  కార్యక్రమంలో మండలంలోని వెలిదండ్ల, కర్ణపాపాయపల్లె, లింగాల, పెద్దకుడాల, ఇప్పట్ల, కోమన్నూతల, తాతిరెడ్డిపల్లె, కామసముద్రం, బోనాల తదితర గ్రామాల రైతులతోపాటు అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిమ్మంపల్లె, దంతెలపల్లె తదితర గ్రామాలకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top