కేఎన్ఆర్ అంత్యక్రియలకు వైయస్ జగ‌న్

హైదరాబాద్, 21 నవంబర్ 2013:

గుండెపోటుతో గురువారం ఉదయం తుది శ్వాస విడిచిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌సీఈసీ సభ్యుడు, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) అంత్యక్రియలకు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి హాజరవుతారని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. కేఎన్ఆర్‌ మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. నాగేశ్వరరావు మృతి తమ పార్టీకి తీరని లోటు అన్నారు. నాగేశ్వరరావు చేసిన సేవలను ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ కొనియాడారు.

Back to Top