సీబీఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్

హైదరాబాద్ 26 సెప్టెంబర్ 2013:

ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఇడుపులపాయ వెళ్లేందుకూ, అలాగే నాలుగో తేదీన గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని ఆ పిటిషన్లో విన్నవించారు. తన  తండ్రి, దివంగత మహానేత డాక్టర్  వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించేందుకు  అక్టోబర్‌ ఒకటి, రెండు తేదీల్లో అనుమతి ఇవ్వాలని కోర్టును  కోరారు. అక్టోబర్‌ 4న  గుంటూరులో రైతులు నిర్వహిస్తున్న ర్యాలీ, సమావేశంలో పాల్గొనేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. బెయిలు మంజూరు సందర్భంలో సీబీఐ కోర్టు శ్రీ జగన్మోహన్ రెడ్డిని  హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని ఆదేశించిన విషయం  తెలిసిందే.

తాజా వీడియోలు

Back to Top