రుణ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పి రైతుల నోట్లో మట్టి పోసిన చంద్రబాబు ప్రభుత్వం పశువుల్ని ఉసురు పెడుతోంది. పశువులకు సరఫరా చేసే గడ్డి లోనూ తన బుద్ధిని ప్రదర్శిస్తోంది. చీకిపోయిన గడ్డిని రైతులకు సరఫరా చేసి చేతులు దులుపుకొంటోంది. ఈ గడ్డిని కిలోకి 3 రూపాయిల చొప్పున కొనాల్సి వస్తోంది. చీకిపోయిన గడ్డిని ఎండబెట్టుకొందామనుకొంటే, ఎండిన తర్వాత కూడా నల్లగా మాడిపోయి రోగాలు తెచ్చిపెడుతోంది. అనేక చోట్ల ఇదే పరిస్థితి..!బెంగళూరు నుంచి పులివెందులకు వెళుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను రైతులు ఆపి తమ గోడు వెళ్ల బోసుకొన్నారు. చీకిపోయిన గడ్డి ఇచ్చి తమను ఇబ్బంది పెడుతున్న వైనాన్ని వినిపించారు. ఈ గడ్డిని కొనలేక, కొన్నా పశువులకు వేయలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఒక వేళ ఈ గడ్డి తింటే పశువులకు రోగాలు వాటిల్లే అవకాశం ఉందని వివరించారు. ఇటువంటి పరిస్థితి మీద ప్రభుత్వం మీద పోరాడతామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.