వైయస్ఆర్ జిల్లా: వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగదు అందుబాటులో ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. <br/>పులివెందులలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్లతో వైయస్ జగన్ భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టత, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా సమస్యలపైనా చర్చించారు. అదే విధంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. <br/>వైయస్ జగన్ వెంట వైయస్ వివేకానందరెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. <br/>