దీక్షకు వేళాయే

విశాఖపట్నంః  విశాఖకు  రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో గురువారం ఉదయం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తొలుత డాబా గార్డెన్స్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నట్లు తెలిపారు.  అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దీక్షకు మద్దతిచ్చిన వామపక్షాలు, లోక్ సత్తా, ప్రజా, విద్యార్థి సంఘాలు, కార్మికులు, మేధావులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించేదాకా పోరు సాగిస్తానని అమర్నాథ్ స్పష్టం చేశారు. 

Back to Top