♦ ఏడాదికి ఒక్క తడితో సరిపెడతారా.. పంటలను ఎలా సంరక్షించుకోవాలి?♦ ఏమీ లేకున్నా.. శాలువాలతో సన్మానాలు చంద్రబాబుకే చెల్లు♦ చిత్రావతి రిజర్వాయర్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి♦ ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న వైఎస్ జగన్♦ కమలాపురం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు సాక్షి, కడప/పులివెందుల : ‘ప్రస్తుత పరిస్థితులలో.. వేసవి నేపథ్యంలో నెలకు మూడు తడులు అవసరం.. కానీ ఏడాదికంతా కలిపి 12 వేల ఎకరాలకు కేవలం ఒక్క తడి నీరు అందించిన చరిత్ర ఇక్కడే చూస్తున్నాం.. 1.25 లక్షల ఎకరాలు ఉన్న ఆయకట్టు, పులివెందుల నియోజకవర్గం, మున్సిపాలిటీకి కేవలం .063 టీఎంసీల నీరు ఏ మూలకు సరిపోతుంది? ఈ కాస్త నీరు అటు సాగు, ఇటు తాగడానికి సరిపోవడం లేదు.అనంతరం మాట్లాడుతూ.. ఈ ఏడాదికి సంబంధించి 4.64 టీఎంసీల నీటిని కేటాయించి.. నాలుగు విడతల్లో నీటిని విడుదల చేయగా... సీబీఆర్‌కు చేరింది 2.55 టీఎంసీల నీరు మాత్రమేనన్నారు. అందులో 1.50 టీఎంసీల నీరు అనంత, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారన్నారు. మిగిలిన 1.013 టీఎంసీల నీటికి సంబంధించి సీబీఆర్‌లో డెడ్ స్టోరేజ్ అనగా .95 టీఎంసీ నీరు ఉంచాల్సి ఉందన్నారు. మిగిలిన .063టీఎంసీ నీటిని సాగునీటికి అందిస్తారా.. తాగునీటికి అందిస్తారా.. అందులో లాసెస్ పరిస్థితి ఏమిటి..అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే ఉన్న పీబీసీ ఇన్‌ఛార్జి ఈఈ మక్బుల్ బాషాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, పులివెందుల రూరల్, అర్బన్, యూసీఐఎల్ ప్రాజెక్టులకు వెళుతున్న నీటికి సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు.అనంతరం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి 177 గ్రామాలకు తాగునీటిని అందించే పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అక్కడే మోటార్ల పరిస్థితి, పంపింగ్ చేసే విధానంపై ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పర్వతరెడ్డి, డీఈ మోహన్‌కుమార్‌లతో చర్చిం చారు. ప్రస్తుతం పనిచేస్తున్న 200, 100హెచ్‌పి మోటార్లతోపాటు మరికొన్ని అదనంగా పెట్టుకొని పంపింగ్ చేయాలని సూచించారు.