ఇడుపులపాయకు బస్సు యాత్ర

నేలకొండపల్లి:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి వైయస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ వరకూ మహానేత వైయస్ఆర్ అభిమానులు మంగళవారం బస్సుయాత్రను చేపట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ప్రారంభించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు మద్దతుగా తామీ యాత్ర చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. జగన్ శీఘ్రమే విడుదల కావాలని వారు అభిలషించారు. వైయస్ఆర్ ఉన్నప్పుడు సంక్షేమ  కార్యక్రమాలూ సక్రమంగా సాగేవని వారు చెప్పారు. బస్సు యాత్ర బుధవారం ఇడుపుల పాయకు చేరుకుంటుంది. అక్కడ వైయస్ఆర్ సమాధికి వారు నివాళులర్పిస్తారు. మొత్తం అయిదు వందల మంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు.

Back to Top