వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో వందలాది మంది చేరిక

వరంగల్/కర్నూలు/విశాఖపట్నం,

7 జూలై 2013:‌ రాష్ట్రంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం కొట్లకొండ తండాకు చెందిన 400 మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ‌వారిని పార్టీ నాయకురాలు రాణి రుద్రమ సాదరంగా ఆహ్వానించారు.

అలాగే.. కర్నూలు జిల్లా వెలుగోడులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకులు బుడ్డా సోదరులు ఆధ్వర్యంలో కాంగ్రెస్, ‌టిడిపిల నుంచి 500 మంది పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.

150 కుటుంబాల చేరిక :
ఖ‌మ్మం జిల్లాలోని కొత్తగూడెం మండ‌లం సుజాత‌న‌గ‌ర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం స‌భ్యుడు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, కొత్తగూడెం నియోజ‌క‌వ‌ర్గ స‌భ్యుడు ఎర‌వ‌ల్లి కృష్ణ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 150‌ కుటుంబాలు వైయస్‌ఆర్ పార్టీలో చేరా‌యి.

కాగా, విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ గేటువలసకు చెందిన 200 మంది టిడిపి కార్యకర్తలు శనివారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ గ్రామ టిడిపి మహిళా నేత దోనేరి సుందరమ్మ, మాజీ ఉప సర్పంచ్ కురిసెల బాబూరావు నాయకత్వంలో వీరంతా శనివారం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అరకు నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ..‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు శ్రీ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే‌ మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయన్నారు.

Back to Top