చంద్రబాబు నిరంకుశ, అవినీతి, ఏకపక్ష పాలనను ఎండగట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నుంచి ప్రారంభించిన‘గడప గడపకూ వైయస్సార్..’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి మహానేత, వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైయస్సార్సీపీ శ్రేణులు..ఆతర్వాత గడపగపడకూ వెళ్లాయి. <br/>రాష్ట్రవ్యాప్తంగా అధ్యక్షులు వైయస్ జగన్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నేతలు, స్థానిక నేతలు ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైయస్సార్‌సీపీ నేతలు ప్రజల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు హామీలపై ప్రస్తావించినపుడుగానీ, పథకాల వల్ల లబ్ధి చేకూరిందా? లేదా? అని అడిగినపుడుగానీ కుటుంబాల నుంచి ‘లేదు... లేదు...’ అనే సమాధానాలే వచ్చాయి. ఈసందర్భంగా బాబు అవినీతి, మోసపూరిత పాలనను ఎండగడుతూ వైయస్సార్సీపీ నాయకులు ప్రతీ గడపలో పర్యటిస్తున్నారు. <br/>