అక్రమ కేసులపై వెల్లువెత్తిన నిరసన

వైయస్‌ఆర్‌ జిల్లా : ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని చింతకొమ్మదిన్నె మండల పార్టీ కన్వీనర్‌ తుమ్మల బాలమల్లారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ పిలుపు మేరకు తాహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ అధికారులను ప్రశ్నించే హక్కు కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వకుండా క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ప్రజల గొంతు నొక్కడం దారుణమని ఆయన అన్నారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ నిజాముద్దీన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గూడా ప్రభాకర్‌రెడ్డి, శ్రీరామిరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు పలవలి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటసుబ్బారెడ్డి, నాయకులు గుత్తిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాజారెడ్డి, బుసిరెడ్డి నీలకంఠారెడ్డి, గజ్జల వెంకటసుబ్బారెడ్డి, గజ్జల నాగేంద్రారెడ్డి, గువ్వల రామచంద్రారెడ్డి, పెద్ద సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top