చంద్రబాబు సోకుల ఖర్చు రూ.వంద కోట్ల పైనే..!

చంద్రబాబు విదేశీ యాత్రలకు సొమ్ములే సొమ్ములు
సీఎం కార్యాలయం ఆధునీకరణకు కోట్లాది కుమ్మరింపు
విజయవాడలో క్యాంపు కార్యాలయానికి ఆధునిక హంగులు
మూడు నగరాల్లో 34 కార్లతో కాన్వాయ్‌లు
 
ఎన్నికల ముందు..
మండుటెండల్లో చంద్రబాబు ప్రయాణం చేసేవారు. సుదీర్ఘంగా ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం మాదిరిగా ప్రచారం చేశారు. ప్రజల కోసం పాదయాత్రలు.. వాడ వాడలా పర్యటనలు చేశారు. చెమటలు కక్కుతూ, ప్రజల కోసమే అన్నట్లుగా పర్యటించారు. ప్రజలకు మాత్రం ఎన్నెన్నో హామీలు..ఎన్నెన్నో వరాలు గుప్పించారు. రైతులందరికీ రుణమాఫీలు, డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీలు చేస్తామంటూ వరాలు ఇచ్చారు. అసలు అప్పటి దాకా అప్పులే కట్టవద్దని ఊదర గొట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేతుల నిండా పెన్షన్లు ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కింద నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయన్నారు. పేదలందరికీ పక్కా గృహాలు గ్యారంటీ అని ప్రతీ చోట చెప్పుకొని వచ్చారు.
 
ఎన్నికల తర్వాత
ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాక సీన్ రివర్సు అయింది. అప్పటి దాకా నడి రోడ్డుపై నిలిచిన చంద్రబాబుకి రోడ్డు మీద వె ళ్లే సామాన్యులు కనిపించటం లేదు. చీటికీ మాటికీ విదేశాలకు వెళ్లి రావటం, కార్పొరేట్ సంస్థలతో సమావేశాలు జరపటమే సరిపోతోంది. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు వరాలే వరాలు. అది కూడా విదేశీ కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అప్పుడు ఇచ్చిన వరాలన్నీ చెట్టెక్కాయి. రైతులు రుణమాఫీ అంటే డబ్బుల్లేవంటున్నారు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ అంటే సొమ్ములు లేవంటున్నారు, పేదల గృహాలు అంటే కాసులు రావటం లేదు. పెన్షన్లకు కూడా కోత పెట్టేశారు. అదేమంటే ఖజానాలో కాసులు లేవంటున్నారు. మొత్తం మీద ప్రజల సంక్షేమ పథకాలు అంటే డ బ్బు తీసేందుకు చేతులు రావటం లేదు.
 
అధికారిక దుబారా..!
ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే, నాణేనికి రెండో వైపు మాత్రం కళ కళ లాడుతోంది. చంద్రబాబు అసలు కార్పొరే ట్ స్వరూపం కళకళ లాడుతూ కనిపిస్తోంది. పదవిలోకి వచ్చి పది నెలలు గడిచాక, పది పేద కుటుంబాలకు మేలు జరిగిందో లేదో తెలీదు కానీ, చంద్రబాబు అండ్ కో మాత్ర కళ కళ లాడుతూ వెలిగిపోతోంది. ఆయన అధికారిక దర్పం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డబ్బులు ప్రవాహంలా ఖర్చు అవుతున్నాయి. 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొలువు దీరాక సచివాలయంలోని ఆయన పేషీకి ఆధునీకరణ పనులు చేపట్టారు. అక్షరాలా 45 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారు. అప్పట్లో ఎన్ని విమర్శలు వచ్చినా వాస్తు అనీ, కార్పొరేట్ సౌకర్యాలు అనీ వెచ్చించారు. తాజాగా విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి ఆధునిక హంగులు దిద్దటం మొదలు పెట్టారు. దీనికి రూ. 16 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లే క్యాంపు కార్యాలయానికి కోట్ల  లో ఖర్చు చేయటంపై అంతా ముక్కున వేలేసుకొంటున్నారు.  విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమానాలు వాడటంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనికి ఇప్పటికే రూ. 15 కోట్లు చెల్లించేశారు. స్మార్టు గ్రామాలు, వార్డుల ప్రచారం కోసం రూ.13 కోట్లు ఖర్చు పెట్టేశారు. నీరు-చెట్టు ప్రచారానికి, ఐదు నక్షత్రాల హోట ళ్లలో సమావేశాలకు, యోగా శిక్షణ వంటి కార్యక్రమాలకు అతిథి సౌకర్యాలకు రూ.11 కోట్లు ఖాళీ అయ్యాయి.  ఇవ న్నీ లెక్క వేస్తే దాదాపుగా రూ. వంద కోట్లకు పైగా ఖర్చు అయింది. ఈ ఖర్చును సక్రమంగా వాడితే సగానికి పైగా డిపార్టుమెంట్ లు హైదరాబాద్‌నుంచి తరలించి ఉండేవని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. 
 
కాన్వాయ్ లకు కోట్లు..!
నిరుపేద రాష్ట్రపు ముఖ్యమంత్రికి ముచ్చటగా మూడు కాన్వాయ్ లు లేవు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇన్ని కాన్వాయ్ లు ఉండవేమో..!హైదరాబాద్‌లో రెగ్యులర్ ప్రయాణాలకు వాడే కాన్వాయ్ కాకుండా విజయవాడలో, తిరుపతిలో కూడా కాన్వాయ్ లు సిద్దం చేసి ఉంచారు. గతంలో నలుపురంగు ఫార్చ్యూనర్ వాహనాల స్థానంలో సిల్వర్ కలర్ సఫారీ వాహనాల్ని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం రూ. 3.07 కోట్లు వెచ్చించి 10 సఫారీ వాహనాల్ని, ఒక జామర్ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ పార్చునర్ వాహనాల్ని విజయవాడకు పంపించారు. మొదట్లో ఉండే పాత సఫారీ వాహనాల్ని తిరుపతికి తరలించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అవసరం రీత్యా వాహనాలు ఉండాలని పోలీసు విభాగం చెబుతున్నా, ఈ రేంజ్ లో వాహనాల్ని మార్చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
 
విదేశీ ప్రయాణాలు..విలాస మార్గాలు..!
చంద్రబాబుకి విదేశీ ప్రయాణాలు అంటే బాగా ఇష్టం. మొదట నుంచి ఆయన క్రమం తప్పకుండా సింగపూర్ వెళ్లి వస్తుండేవారు. దీనికి ప్రైవేటు కారణాలు ఉన్నాయని చెవులు కొరుక్కొనే వారు లేకపోలేదు. అప్పట్లో ఆయన సొంత ఖర్చులతో వెళ్లే వారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన అదే పనిగా విదేశాలకు వెళ్లి రావటం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం అయిన పది నెలల్లో ఐదు సార్లు విదేశాలకు వెళ్లి వచ్చారు. అంటే సగటున రెండు నెలలకోసారి పారిన్ ట్రిప్ ఉంటోంది. పైగా ఆయనతో పాటు ఇష్టమైన మంత్రులు, ఉన్నతాధికారులు, సలహాదారులు వెళ్లి వస్తున్నారు. ఈ సారి అయితే కొందరు ఎల్లో మీడియా జర్నలిస్టుల్ని కూడా తీసుకొని వెళ్లారు. ఈ టీమ్ కు స్టార్ హోటళ్ల విడిదులు, ధూమ్ ధామ్ గా చక్కర్లు అన్నీ ప్రభుత్వ ఖజానా ఖర్చులే అని గుర్తించుకోవాలి. చంద్రబాబు విదేశీ విలాసాల వివరాలు ఇలా ఉన్నాయి.
 
పేదల సంగతి ఏమిటి.!
మరి పేదల సంక్షేమ పథకాల కు డబ్బుల్లేవని వంకలు చెప్పే ప్రభుత్వం ఆచరణలో మాత్రం దుబారాలు చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సోకులకు అయ్యే ఖర్చుని సరైన మార్గంలో వె చ్చిస్తే సామాన్యులకు ఊరట కలుగుతుందన్న మాట ఉంది. రుణ మాఫీ జరగక ఫిర్యాదు చేద్దామని హైదరబాద్ వస్తే ఎండ నుంచి రక్షణ , తాగేందుకు సురక్షిత తాగునీరు వంటి అవసరాలు కూడా తీర్చటం లేదు. కానీ మంత్రులు, అయినవారి వైభవాల కోసం కోట్లు ఖర్చు పెట్టడం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. 
Back to Top